మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సోమవారం విజయవాడలో తన సోదరి సుభాషిణితో కలిసి జయసుధ చంద్రబాబు నాయుడుని కలిసి తన కుమారుడు నిహార్ పెళ్లికి ఆహ్వానిస్తూ పత్రికను అందించారు. జయసుధకు ఇద్దరు కొడుకులు నిహార్ కపూర్, శ్రియాన్ కపూర్. వీరిలో నిహార్ కపూర్ ఢిల్లీకి చెందిన అమ్మాయి అమ్రిత్ కౌర్‌ను ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, ఆమె గతంలో టీడీపీతో కలిసి పనిచేసిన అనుబంధంతోనే చంద్రబాబుని ఆహ్వానించినట్లుగా తెలిసింది.
చంద్రబాబుతో జయసుధ భేటీ