సాక్షి, విజయవాడ : దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మందికి పైగా రైతులకు ఈ పథకం ద్వారా లభ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద రూ. 12,500 అందించనున్నామని, నేరుగా లభ్ధిదారుల ఇంటికెళ్లి రషీదులను అందజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 15 తర్వాత కూడా అర్హులైన లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా పారదర్శకతతో వైఎస్సార్ పథకాన్ని అమలు చేసున్నామని పేర్కొన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల కష్టాలు తీర్చేందుకు మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు.
'పారదర్శకంగా రైతు భరోసా పథకం'